: నట్టి కుమార్ ఎవరో నాకు తెలియదు... అసలు నేను అతనిని కలవనే లేదు: అచ్చెన్నాయుడు
సినీ నిర్మాత నట్టి కుమార్ చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, నట్టి కుమార్ ఎవరో తనకు తెలియదని అన్నారు. తన జీవితంలో అలాంటి వ్యక్తిని కలిసిన గుర్తు లేదని ఆయన చెప్పారు. తనపై ఆరోపణలు చేస్తున్న నట్టి కుమార్ లేదా ఇంకెవరైనా విచారణ జరిపించుకోవచ్చని ఆయన సవాలు విసిరారు. నట్టి కుమార్ చెబుతున్న విషయాలు తన దృష్టికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఏపీలో పలువురు మంత్రులు, అధికారులకు గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధాలున్నాయని తాను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని నట్టి కుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే.