: క్షమాపణలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు: కన్నడ నటి రమ్య


‘కొందరు అన్నట్లుగా పాకిస్తాన్ దేశమేమీ నరకం కాదు...’ అంటూ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పబోనని కన్నడ సినీ నటి, మాజీ ఎంపీ రమ్య పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పుచేయలేదని, తన సొంత అభిప్రాయాలను మాత్రమే చెప్పానని తెలిపారు. సొంత అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రజాస్వామ్య దేశంలో ప్రతిఒక్కరికీ ఉంటుందని చెప్పింది. కాగా, ఇటీవల పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ దేశాల యువ పార్లమెంటేరియన్ల సమావేశానికి నటి రమ్య హాజరయ్యారు. సమావేశానంతరం భారత్ కు చేరుకున్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రమ్య చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ కత్నమణె విట్టల్ గౌడ అనే న్యాయవాది ఆమెపై కేసు పెట్టారు.

  • Loading...

More Telugu News