: కండలవీరుడి సోదరి ఇంటిలో చోరీ!... నగదు, ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్లిన దొంగలు!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఇంటిలో దొంగలు పడ్డారు. సండే ట్రిప్ కోసమని భర్త, కూతురుతో కలిసి వెళ్లిన అర్పిత... తిరిగి ఇంటికి వచ్చేసరికి తన ఇల్లు చోరీకి గురైందని తెలుసుకుని బావురుమంది. వివరాల్లోకెళితే... ముంబైలోని బాంద్రాలోని శెర్లీ రాజన్ రోడ్ లో ఉన్న ఫసిపిక్ హైట్స్ లో అర్పిత నివాసముంటోంది. ఆదివారం సండే ట్రిప్ కోసం భర్త, కూతురుతో కలిసి ఆమె బయటకు వెళ్లింది. తిరిగివచ్చేలోగా ఇంటిలో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయట. తీరా అంతా పరిశీలిస్తే... ఇంటిలో ఉన్న రూ.3.25 లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు వారు గుర్తించారు. దీంతో అర్పిత భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.