: ఆనాడు క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రికి ఎందుకింత ఆర్భాటంగా స‌న్మానం చేస్తున్నారో అనుకున్నా: పుల్లెల గోపిచంద్


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, ప్ర‌జ‌లు త‌మ‌ను ఎంతో ఆప్యాయంగా ఆద‌రిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌ని పి.వి సింధు కోచ్ పుల్లెల‌ గోపిచంద్ అన్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఈరోజు ఆయ‌న మాట్లాడుతూ.. 2000 సంవ‌త్స‌రంలో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి మెడ‌ల్ గెలిచిన‌ప్పుడు ఆమెను ఘ‌నంగా స‌న్మానించార‌ని, అప్పుడు అది చూసిన తాను ఎందుకింత‌ ఆర్భాటంగా స‌న్మానం చేస్తున్నారో అనుకున్నాన‌ని అన్నారు. కానీ ఆ స‌న్మానం చూసే తాను బ్యాడ్మింట‌న్‌లో రాణించాన‌ని గోపిచంద్ చెప్పారు. ఆ స్ఫూర్తితోనే ఎన్నో మెడ‌ల్స్ సాధించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈరోజు సింధు గెల‌వ‌డం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. త‌మ‌ను అంద‌రూ ప్రోత్స‌హిస్తున్నారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News