: మీ ఆశీస్సుల వల్లే పతకం వచ్చింది!... బెజవాడ సన్మాన వేదికపై పీవీ సింధు!
రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు... తాను పతకం సాధించడానికి తెలుగు ప్రజల ఆశీస్సులే కారణమని పేర్కొంది. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... సింధుతో పాటు ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సింధు... తెలుగు ప్రజల ఆశీస్సుల వల్లే తాను పతకం సాధించగలిగానని పేర్కొంది. ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది.