: వేదికపై బ్యాడ్మింటన్ పోరు.. సింధుతో సరదాగా బ్యాడ్మింటన్ ఆడిన ముఖ్యమంత్రి చంద్రబాబు
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పి.వి సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్ విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని స్వయంగా ఆహ్వానించి, వేదికపైకి తీసుకొచ్చారు. వేదికపై సింధుకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి టీడీపీ ఎంపీ మాగంటి బాబు షటిల్ రాకెట్‌స్ను బహుమతిగా ఇచ్చారు. ఆ షటిల్ రాకెట్‌లతో చంద్రబాబు, సింధు వేదికపై కాసేపు సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. ఈ దృశ్యం స్టేడియంలోని సింధు అభిమానులను, టీవీల ద్వారా కార్యక్రమాన్ని చూస్తోన్న ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.