: సింధు సన్మాన వేడుకకు వ్యాఖ్యాతగా బొండా!... 'సిల్వర్ స్టార్'పై ప్రత్యేక గీతాన్ని ఆలపించిన రైటర్స్!
రియో ఒలింపిక్స్ సిల్వర్ స్టార్ పీవీ సింధుకు బెజవాడలో ఘన స్వాగతం లభించింది. నేటి ఉదయం ప్రత్యేక విమానంలో సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ ను బెజవాడ తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం... గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వారిని భారీ జనసందోహంతో కూడిన ర్యాలీతో నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియానికి చేర్చింది. ఆ తర్వాత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గజమాలలతో సింధు, గోపీచంద్ లను చంద్రబాబు సత్కరించారు. ఈ వేడుకకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక సింధు పేరు మీద ఓ ప్రత్యేక గీతాన్ని రాసిన ఔత్సాహిక రచయితలు స్వయంగా దానిని వేదిక మీద ఆలపించారు.‘జయహో సింధు... జయహో, జయహో సింధు’ పేరిట రూపొందిన ఆ గీతం అక్కడి వారిని బాగా ఆకట్టుకుంది.