: ఇందిరా గాంధీ స్టేడియానికి చేరుకున్న బ్యాడ్మింటన్ స్టార్.. 'సింధూ.. సింధూ' అంటూ అభిమానుల హర్షధ్వానాలు
తాజా ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పి.వి సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్ గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియానికి చేరుకున్నారు. ప్రత్యేక వాహనంలో వారు ప్రజలకి అభివాదం చేస్తూ వచ్చారు. స్టేడియానికి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. డ్రమ్స్ శివమణి వేదికపై తన ప్రదర్శన ఇస్తుండగా చంద్రబాబు నాయుడు ఆయనకు కరచాలనం చేసి అభినందించారు. మరికాసేపట్లో సింధు, పుల్లెల గోపిచంద్‌లను చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించనున్నారు. ఈ సందర్భంగా స్టేడియంలోకి చేరుకున్న సింధుకి ఆమె అభిమానులు 'సింధూ.. సింధూ' అంటూ హర్షధ్వానాలు చేస్తూ ఆహ్వానించారు.