: రాష్ట్రాల్లో ఎలా ముందుకెళదాం?.. పార్టీ నేతలతో అమిత్ షా కీలక సమావేశం
రాష్ట్రాల్లో తమ పార్టీని బలపరచడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈరోజు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులు, తమ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరుపుతున్నారు. అన్ని రాష్ట్రాల కోర్ కమిటీలు పాల్గొంటున్న ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. రాష్ట్రాల్లో ఎలా ముందుకెళదాం? అనే అంశంపై అమిత్ షా పలు సూచనలు చేస్తున్నారు. రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసే అంశంపై నేతల సూచనలను కూడా ఆయన సేకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్‌తో పాటు రాష్ట్ర నేతలు కిషన్‌రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.