: ముంబై బయలుదేరిన కేసీఆర్!... మరికాసేపట్లో ‘మహా’ ఒప్పందంపై సంతకాలు!


తెలంగాణ సాగునీటి కష్టాలను తీర్చనున్న మూడు ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకోనున్న కీలక ఒప్పందాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి బయలుదేరారు. మరికాసేపట్లోనే ముంబై చేరుకోనున్న ఆయన నేరుగా సహ్యాద్రి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. ఇదిలా ఉంటే... నిన్ననే ముంబై చేరుకున్న తెలంగాణ కేబినెట్ మంత్రులు ఇప్పటికే ఈ ఒప్పందాలకు సంబందించి కార్యరంగం సిద్ధం చేసినట్లు సమాచారం. కేసీఆర్ ముంబైలో కాలు మోపగానే ఒప్పందాలపై సంతకాల కార్యక్రమం మొదలుకానుంది. కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ల సమక్షంలో ఇరు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు.

  • Loading...

More Telugu News