: సింధుకు స్వాగతం కోసం క్యూ కట్టిన మంత్రులు, టీడీపీ నేతలు!


రియో ఒలింపిక్స్ లో సత్తా చాటి రజత పతకం సాధించిన స్టార్ షట్లర్, తెలుగు తేజం సింధుకు విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. నేటి ఉదయం హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్టులో ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రత్యేక విమానంలో తన కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ఆమెకు సాదర స్వాగతం లబించింది. సింధుకు స్వాగతం పలికేందకు ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు క్యూ కట్టారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తదితరులు సింధుకు స్వాగతం పలికారు. ఇక బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రత్యేక విమానం వద్ద సింధుకు స్వాగతం పలికిన బెజవాడ ఎంపీ కేశినేని నాని ఆమెను వెంటబెట్టుకుని విజయవాడ చేరుకున్నారు.

  • Loading...

More Telugu News