: విమానాశ్రయం నుంచి సింధు విజ‌యోత్స‌వ ర్యాలీ ప్రారంభం


బ్రెజిల్ లోని రియో డి జ‌నీరోలో జ‌రిగిన ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్, తెలుగు తేజం పి.వి సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్‌ గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఒక ప్ర‌త్యేక వాహ‌నంలో వీరిని తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా వేలాది మంది అభిమానులు, ప‌లు స్కూళ్ల‌ విద్యార్థులు సిందుకి స్వాగతం చెబుతూ గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌య‌ ప‌రిస‌ర ప్రాంతాల్లో క‌నిపిస్తున్నారు. సింధుకి జీవితాంతం గుర్తుండిపోయేలా ప్ర‌భుత్వం ఆమెకు స్వాగ‌త ఏర్పాట్లు చేసింది. సింధు అభిమానులకి అభివాదం చేస్తూ ముందుకి సాగుతోంది. మ‌రికాసేప‌ట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వీరిరువురికీ ప్రోత్సాహ‌కాలు అందించి స‌న్మానించనున్నారు. స‌న్మాన కార్య‌క్ర‌మం త‌రువాత దుర్గాఘాట్‌లో సింధు పుష్క‌రస్నాన‌మాచ‌రించ‌నుంది. ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుంటుంది.

  • Loading...

More Telugu News