: బేగంపేటలో ప్రత్యేక విమానం ఎక్కిన సింధు!... మరికాసేపట్లో గన్నవరంలో ల్యాండింగ్!
రియో ఒలింపిక్స్ లో భారత్ సత్తా చాటిన తెలుగు తేజం పీవీ సింధు కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి విజయవాడ బయలుదేరారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి బేగంపేట నుంచి బయలుదేరిన ఆమె మరికాసేపట్లో బెజవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నారు. సింధుకు ఘన స్వాగతం చెప్పేందుకు అక్కడ ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గన్నవరం ఎయిర్ పోర్టు వద్దకు వేలాది మంది విద్యార్థులు చేరుకున్నారు. భారీ జాతీయ పతాకాలతో సిద్ధంగా ఉన్న విద్యార్థులు సింధు దిగగానే ఆమెకు ఘన స్వాగతం చెప్పనున్నారు. ఆ తర్వాత భారీ ర్యాలీతో సింధును నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియానికి తీసుకెళతారు.