: పీవీ సింధు...ఇండియన్!: స్టార్ షట్లర్ స్థానికతపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన గోపీచంద్!


రియో ఒలింపిక్స్ లో భారత్ కు రజత పతకాన్ని సాధించిపెట్టిన స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్థానికత, కులంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ చర్చకు సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ నిన్న ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. సౌమ్యంగానే ఇచ్చిన సదరు క్లారిటీ ద్వారా సింధు కులం కోసం వెంపర్లాడిన నెటిజన్లకు ఆయన భారీ షాకిచ్చారు. తెలుగు నేలకు చెందినప్పటికీ సింధు... భారతీయురాలు (ఇండియన్) అని గోపీచంద్ పేర్కొన్నారు. నిన్న హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఒక్కమాట చెప్పాలనుకుంటున్నా. సింధు భారత్ కు చెందుతుంది. మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ లు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించాయి. తమిళనాడు, ఒడిశా, కర్ణాటక ముఖ్యమంత్రులు సింధును పొగడుతున్నారు. ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా గర్వకారణం. ఈ వేడుకలో అందరూ భాగస్వామ్యం కావడాన్ని మనం ఆస్వాదించాలి. క్రీడలతోనే జాతీయ సమగ్రత సాధ్యమవుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News