: బెజవాడకు నేడు సింధు, గోపీచంద్!... ఘన స్వాగతానికి ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లు!


రియో ఒలింపిక్స్ లో భారత్ కు రజత పతకాన్ని సాధించిపెట్టిన స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు నేడు విజయవాడకు వెళ్లనుంది. తన కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి నేటి ఉదయం విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకోనున్న సింధుకు ఘన స్వాగతం పలికేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం దాకా సింధు, గోపీచంద్ లను ర్యాలీగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టేడియంలో ఘన సన్మానం తర్వాత సింధు కృష్ణా పుష్కరాల్లో భాగంగా పవిత్ర స్నానం చేయనుంది. ఆ తర్వాత రాత్రి జరిగే హారతి కార్యక్రమానికి కూడా హాజరుకానుంది.

  • Loading...

More Telugu News