: ఇరాక్ లో బాల సూసైడ్ బాంబర్ పట్టివేత


ఇరాక్ లో ఒక చిన్నారి సూసైడ్ బాంబర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిర్కుక్ నగరంలోని షియా మసీదులో నిన్న ఆత్మాహుతి దాడి జరిగింది. అయితే, ఈ సంఘటనలో సూసైడ్ బాంబర్ మాత్రమే చనిపోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న ఒక బాలుడిని అదుపులోకి తీసుకోగా, అతడు బెల్టు బాంబు ధరించి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అతడి నుంచి ఆ బెల్టును తొలగించారు. అనంతరం బాలుడిని అరెస్ట్ చేశారు. కాగా, ఇందుకు సంబంధించిన ఒక వీడియో స్థానిక టీవీ ఛానెల్స్ లో ప్రసారమవుతుండటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News