: మాకు ఇది మెగా పండగ: హీరో సాయి ధరమ్ తేజ్
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే... తమకు మెగా పండగతో సమానమని ‘మెగా’ కుటుంబానికి చెందిన యువహీరో సాయిధరమ్ తేజ్ అన్నాడు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరుగుతున్న చిరంజీవి బర్త్ డే వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న సాయిధరమ్ మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కోసం ప్రతి సంవత్సరం వేచిచూస్తుంటామని అన్నారు. కాగా, అభిమానుల కోరిక మేరకు చిరంజీవి నటించిన ఒక చిత్రంలోని డైలాగ్ లను సాయిధరమ్ చెప్పాడు.