: డైరెక్టర్ సుకుమార్ అసిస్టెంట్ విక్రమ్ అనుమానాస్పద మృతి


ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న విక్రమ్ హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. నిన్నరాత్రి ఒక భవనం పై నుంచి విక్రమ్ కింద పడి మృతి చెందినట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ మృతిపై అతని సోదరుడు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇతని మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, దర్శకుడు సుకుమార్ వద్ద చాలా రోజులుగా విక్రమ్ పనిచేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి విక్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.

  • Loading...

More Telugu News