: రాజ్ భవన్ లో సింధు, గోపీచంద్ కు సన్మానం


రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ లను రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ, సింధు, గోపీచంద్ లను చూసి యావత్తు దేశం గర్విస్తోందని, వీరు మెడల్ కోసం కాదు, దేశం కోసం ఆడారని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా సింధు, గోపీచంద్ లకు గవర్నర్ దంపతులు ఒక జ్ఞాపికను బహూకరించారు.

  • Loading...

More Telugu News