: సీఎం కేసీఆర్ ను కలిసిన సింధు... రూ.5 కోట్ల చెక్కు బహూకరణ
రియో ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కొద్ది సేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన క్యాంపు ఆఫీసులో కలిసింది. సింధుతో పాటు కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించి, సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహకం కింద సింధుకు రూ.5 కోట్ల చెక్ ను, పుల్లెల గోపీచంద్ కు కోటి రూపాయల చెక్ ను కేసీఆర్ అందజేశారు. అంతేకాకుండా ఒలింపిక్స్ లో ప్రతిభ కనబర్చిన శ్రీకాంత్ కు రూ.25 లక్షలు, సింధు ఫిజియోథెరపిస్టు కిరణ్ కు రూ.25 లక్షల చెక్ లను కేసీఆర్ అందజేశారు.