: ‘రియో’లో జమైకా చిరుత రాసలీలలు... వైరల్ గా మారిన ఫొటోలు
రియో ఒలింపిక్స్ తో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఆనందానికి అవధుల్లేవు. రియో ఒలింపిక్సే తనకు చివరి ఒలింపిక్స్ అని ప్రకటించిన బోల్ట్, తాను అనుకున్న ట్రిపుల్ హ్యాట్రిక్ ను సాధించడంతో మరింత ఆనందంగా ఉన్నాడు. వీటన్నింటికీ తోడు నిన్న తన 30వ పుట్టినరోజు జరుపుకున్న బోల్ట్ ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. హ్యాపీగా డ్యాన్స్ చేశాడు. ముఖ్యంగా బ్రెజిల్ అమ్మాయి జాడీ డ్యురేట్ (20)తో నిన్న రాత్రి రాసలీలలు సాగించాడు. ఇందుకు సాక్ష్యం డ్యురేట్ తన వాట్సప్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఫొటోలే. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ గా మారాయి. బోల్ట్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండటం గమనార్హం. కాగా, బోల్ట్ తో ఉన్న ఫొటోలు బయటకు రావడంపై డ్యురేట్ స్పందిస్తూ, బోల్ట్ ఎవరో తనకు తెలియదని, తన ఫ్రెండ్ చెప్పిన తర్వాతే అతను బోల్ట్ అని తెలిసిందని చెప్పింది. వాట్సాప్ లో షేర్ చేసిన తన ఫొటోలు వైరల్ కావడం తనకు చాలా సిగ్గుగా ఉందని చెప్పింది.