: సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్ లైట్’ హాలీవుడ్ మూవీకి కాపీనట!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం పేరు ‘ట్యూబ్ లైట్’. బాలీవుడ్ లో ఈ చిత్రం గురించి చర్చించుకోవడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి, సల్మాన్ తో ‘ఏక్ థా టైగర్’, ‘భజరంగీ భాయీ జాన్’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు కబీర్ ఖాన్ మళ్లీ కండలవీరుడితో ఈ చిత్రాన్ని తీస్తుండటం. రెండో కారణం, సల్లూ భాయ్ సరసన చైనాకు చెందిన ప్రముఖ నటి ఝఝు నటిస్తుండటం! వీటితో పాటు ‘ట్యూబ్ లైట్’ చిత్రం హాలీవుడ్ సినిమా ‘లిటిల్ బాయ్’ కాపీ అనే ప్రచారం జరుగుతోంది. తండ్రీకొడుకుల మధ్య జరిగే కథ ‘లిటిల్ బాయ్’. కాగా, ఆ ‘లిటిల్ బాయ్’ కథాంశంలో స్వల్ప మార్పులు చేసి ఇద్దరు అన్నదమ్ముల మధ్య బంధాన్ని కథాంశంగా తీసుకుని, ‘ట్యూబ్ లైట్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్ లో నే కాదు, సామాజిక మాధ్యమాల్లో కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో సల్మాన్, సొహైల్ ఖాన్ లు అన్నదమ్ములుగా నటిస్తున్నారు.