: అథ్లెట్ సుధా సింగ్ కు జ్వరం... 'జికా వైరస్' అనుమానంతో టెస్టులు


రియో ఒలింపిక్స్ లో పాల్గొని వచ్చిన భారత అథ్లెట్ సుధా సింగ్ వైరల్ ఫీవర్, ఒంటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. ఆమె బీపీ లెవెల్స్ కూడా తగ్గాయి. ఆమెకు జికా వైరస్ ఉందేమోనన్న అనుమానంతో సుధాను ఒంటరిగా ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమెకు జికా వైరస్ ఉందో లేదో ఇంకా కచ్చితంగా నిర్ధారణ కాలేదు. భారత్ తరపున స్టీపుల్ ఛేజ్ ఈవెంట్ లో పాల్గొని వచ్చిన ఆమె నుంచి పరీక్షల నిమిత్తం రక్తనమూనాను తీసుకున్నామని, వైరల్ ఫీవర్ కావచ్చని, జికా వైరస్ ఉండకపోవచ్చని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వైద్యురాలు ఎస్సార్ సరళ పేర్కొన్నారు. కాగా, రియో ఒలింపిక్స్ కు వెళ్లిన సుధా సింగ్ గదిలోనే ఉన్న భారత క్రీడాకారులు ఓపీ జైషా, కవితా రౌత్ కూడా అస్వస్థతకు గురయ్యారు. సుధా సింగ్ ఎటువంటి లక్షణాలతో బాధపడుతోందో అలాంటి లక్షణాలతోనే వీరు కూడా ఇబ్బంది పడుతున్నారు.

  • Loading...

More Telugu News