: ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం
ఢిల్లీలో కొద్దిసేపటిక్రితం స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ఆందోళనకు గురయిన ఢిల్లీవాసులు భయంతో ఇళ్లనుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంప లేఖినిపై దాని తీవ్రత 3.7గా నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు. భూకపం కేంద్రం హరియాణాలోని చాజవాస్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిపారు. భూప్రకంపనలతో కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వారు పేర్కొన్నారు.