: భవిష్యత్తులో సింధు బంగారు పతకం సాధిస్తుంది: పుల్లెల గోపిచంద్
భవిష్యత్తులో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి సింధు ఒలింపిక్స్లో బంగారు పతకం సాధిస్తుందని ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రియో ఒలింపిక్స్ కోసం సింధు చాలా కష్టపడిందని అన్నారు. సింధు ప్రతిరోజు తెల్లవారు జామునే అకాడమీకి వచ్చి సాధన చేసేదని ఆయన తెలిపారు. ఇప్పుడు పెద్ద వేదికపై అవసరమైన ఆటతీరును ప్రదర్శించి ఆమె విజేతగా నిలిచిందని ప్రశంసించారు. సింధు విజయం కొత్త క్రీడాకారులకు ఎంతగానో ఉత్సాహాన్నిస్తుందని అన్నారు.