: వీసీల నియామకంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టేటస్ కో
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ల (వీసీ) నియామకాలకు సంబంధించిన విధివిధానాలపై వాదనలు జరుగుతుండగానే వీసీలను నియమించడం పట్ల హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన వీసీ ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టి వేసింది. అయితే, హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈరోజు వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం వీసీల నియామకంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టేటస్ కో జారీ చేసింది. నియామకంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.