: రియో ఒలింపిక్స్ లో తొలిసారిగా స్వర్ణాన్ని అందుకున్న పది దేశాలు ఇవే!


ఒలింపిక్స్ లో తమ ప్రతిభను చాటుకునే అవకాశం లభించడమే అదృష్టంగా క్రీడాకారులు భావిస్తారు. అలాంటిది ఏకంగా స్వర్ణ పతకం సాధిస్తే.. వారి ఆనందానికి హద్దులుండవనేది అతిశయోక్తి కాదనిపిస్తుంది. రియో ఒలింపిక్స్ లో 10 దేశాలు మొట్ట మొదటిసారిగా స్వర్ణ పతకాలను సాధించాయి. ఆ వివరాలు.. * బహ్రెన్ కు చెందిన రుత్ జెబెట్ అనే క్రీడాకారిణి మహిళల స్టీపుల్ ఛేజ్ లో వ్యక్తిగతంగా స్వర్ణ పతకం సాధించింది. * పురుషుల రగ్బీ ఫైనల్లో ఫిజి దేశం తొలి పసిడి పతకం తమ ఖాతాలో వేసుకుంది. * డబుల్ ట్రాప్ షూటింగ్ లో కువైట్ కు చెందిన సైనికాధికారి ఫెహైద్ ఆల్ ఢీహని వ్యక్తిగత స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. * జోర్డాన్ దేశం పదేళ్ల కలను అహ్మద్ అబుఘోష్ తైక్వాండోలో గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా నెరవేర్చాడు. * కొసావో దేశానికి తొలి స్వర్ణ పతకం మహిళల జూడో లో మజ్లిండా కెల్మెండీ సాధించి పెట్టింది. * మహిళల టెన్నిస్ సింగిల్స్ లో ప్యూర్టోరికా దేశానికి చెందిన మోనిక ప్యూగ్ తొలి పసిడి పతకం సాధించింది. * పురుషుల 100 మీటర్ల బటర్ ఫ్లైలో మైకేల్ ఫెల్ప్స్ ను ఓడించిన సింగపూర్ స్విమ్మర్ స్కూలింగ్ ఆ దేశానికి తొలి బంగారు పతకం సంపాదించి పెట్టాడు. * తజకిస్థాన్ దేశానికి చెందిన హ్యామర్ త్రో ప్లేయర్ డిషోద్ నజరోవ్ పురుషుల విభాగంలో ఆ దేశానికి తొలి స్వర్ణ పతకం సాధించాడు. * 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో వియత్నాం క్రీడాకారుడు హోంగ్ జువాన్ విన్హ్ ఆ దేశానికి తొలి పసిడి పతకాన్ని అందించాడు. * వెస్ట్ ఆఫ్రికన్ దేశమైన కోత్ దిల్వాయిర్ కు త్వైక్వాండోలో స్వర్ణ పతకాన్ని చీక్ సల్లాహ్ సాధించి పెట్టాడు.

  • Loading...

More Telugu News