: బాంబు పేల్చిన సినీ నిర్మాత నట్టి కుమార్!... నయీమ్ తో టాలీవుడ్ కు లింకులున్నాయని సంచలన ప్రకటన!


తెలంగాణ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఇటీవల హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు సంబంధించి ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రధానంగా టాలీవుడ్ ను టార్గెట్ చేసిన నట్టి కుమార్... తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలకు నయీమ్ తో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు గుప్పించారు. తెలుగు చిత్ర సీమలో ప్రముఖ నిర్మాతలుగా కొనసాగుతున్న సి.కల్యాణ్, అశోక్ కుమార్, బండ్ల గణేశ్, సచిన్ జోషిలకు నయీమ్ తో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. సినిమా థియేటర్లలో క్యాంటీన్ల వ్యాపారమంతా నయీమ్ దేనన్నారు. ఈ క్రమంలో తన థియేటర్ ను కూడా నయీమ్ అనుచరులు లాగేసుకున్నారని ఆయన ఆరోపించారు. నయీమ్ తో టాలీవుడ్ కు ఉన్న లింకులపై తెలంగాణ సిట్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఏపీలోని కొందరు పోలీసు అధికారులకు కూడా నయీమ్ తో సంబంధాలున్నాయన్నారు. ఈ విషయాలపై ఏపీ పోలీసులకు, మంత్రి అచ్చెన్నాయుడికి చెప్పినా పట్టించుకోలేదని కూడా నట్ టికుమార్ సంచలన ఆరోపణలు చేశారు.

  • Loading...

More Telugu News