: తెలంగాణలో కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల!


తెలంగాణలో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలతో పాటు పాత జిల్లాల్లో మార్పులు చేర్పులకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో కూడిన ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు, సలహాలు తెలియజేయాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అభ్యంతరాలు, సలహాలకు నెల రోజుల గడువు విధిస్తున్నట్లు ప్రకటించింది. అభ్యంతరాలు, సలహాలను జిల్లా కల్లెక్టరేట్లు, సీసీఎల్ఏ కార్యాలయాల్లో అందజేయాలని సూచించింది.

  • Loading...

More Telugu News