: బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధుకి ఘనసన్మానం
శంషాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియానికి చేరుకున్న బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి.సింధుతో పాటు ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్‌ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, మహేందర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. వారిరువురికీ జ్ఞాపికలను అందించారు. అనంతరం సింధుకి తెలంగాణలోని పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల యాజమాన్యాలు పుష్పగుచ్చాలనందించి అభినందించాయి. కాసేపట్లో సింధు, పుల్లెల గోపిచంద్ మాట్లాడనున్నారు.