: న‌ర్సింగ్ యాద‌వ్ ట్యాబ్లెట్ల రూపంలో ఉద్దేశపూర్వకంగానే నిషేధిత పదార్థాలు తీసుకున్నాడు: స్పష్టం చేసిన సీఏఎస్‌


భారత రెజ్ల‌ర్ న‌ర్సింగ్ యాద‌వ్ డోపింగ్ ఆరోప‌ణ‌ల‌తో నాలుగేళ్ల నిషేధానికి గురైన విషయం తెలిసిందే. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేష‌న్ ఫ‌ర్ స్పోర్ట్స్ (సీఏఎస్‌) ఆయనపై తీసుకున్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల న‌ర్సింగ్ యాద‌వ్‌ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ కుట్రపూరితంగానే తనను ఈ వివాదంలో ఇరికించారని ఆరోపించాడు. అయితే, ఆయ‌న‌కు తాజాగా మ‌రోసారి చుక్కెదురైంది. న‌ర్సింగ్ యాద‌వ్‌ ఉద్దేశపూర్వకంగానే నిషేధిత పదార్థాలు తీసుకున్నాడని సీఏఎస్‌ తెలిపింది. త‌న‌పై వ‌చ్చిన ఆరోపణలను కొట్టివేయ‌డానికి న‌ర్సింగ్ యాద‌వ్ సాక్ష్యాలు సమర్పించలేక‌పోయాడ‌ని చెప్పింది. ఆయ‌న ప‌లుసార్లు ట్యాబ్లెట్ల రూపంతో నిషేధిత ప‌దార్థాలు తీసుకున్నాడని నిపుణుల కమిటీ త‌మ‌కు నివేదిక ఇచ్చింద‌ని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేష‌న్ ఫ‌ర్ స్పోర్ట్స్ ఈరోజు మీడియాకు తెలిపింది.

  • Loading...

More Telugu News