: గచ్చిబౌలి స్టేడియంకి చేరుకున్న సింధు.. హర్షధ్వానాలతో జేజేలు పలికిన అభిమానులు
బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి.సింధు హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియానికి చేరుకుంది. మరికాసేపట్లో ఆమెను ఘనంగా సన్మానించనున్నారు. మైదానానికి చేరుకున్న సింధుకి వేలాదిమంది అభిమానులు హర్షధ్వానాలతో జేజేలు పులుకుతూ స్వాగతం పలికారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేటట్లు కళాకారులు పలురకాల ప్రదర్శలు ఆమె ముందు ప్రదర్శిస్తూ స్వాగతం చెప్పారు. స్టేడియంలో ఉన్న అభిమానుందరికీ సింధు, పుల్లెల గోపిచంద్ అభివాదం చేశారు. భారత్‌కి మెడల్ తీసుకొచ్చిన సింధుని చూసిన ఆనందంతో స్టేడియంలోని అభిమానులు జయహో సింధు అంటూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.