: మూతపడిన ‘ఆస్క్ మీ.కామ్’!... రోడ్డున పడ్డ 4,000 మంది ఉద్యోగులు!


దేశీయ ఈ- కామర్స్ లో ప్రముఖ సంస్థగా పేరుగాంచిన ‘ఆస్క్ మీ. కామ్’ తన కార్యకలాపాలను మూసేసింది. తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాలన్నింటినీ మూసివేసేసింది. ఫలితంగా సంస్థలో పనిచేస్తున్న 4,000 మంది సిబ్బంది రోడ్డున పడ్డారు. సంస్థ నిర్వహణకు సంబంధించిన నిధుల లేమితో సతమతమవుతున్న నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ మాతృక అయిన ‘గెట్ ఇట్ ఇన్ఫో సర్వీసెస్ గ్రూప్’ సీఈఓ సిబ్బందికి పంపిన సందేశంలో పేర్కొన్నారు. సంస్థ కార్యకలాపాలను మూసివేస్తున్న నేపథ్యంలో సంస్థ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సీనియర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో ఆ సంస్థ గడచిన నెల (జూలై)కి సంబంధించి సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేదు. ఆస్క్ మీ. కామ్ ఛత్రం కింద... ఆస్క్ మీ.కామ్ (క్లాసిఫైడ్స్), ఆస్క్ మీ బజార్, ఆస్క్ మీ గ్రోసరీ, ఆస్క్ మీ పే... తదితర ఆన్ లైన్ వెబ్ సైట్లు పనిచేస్తున్నాయి.

  • Loading...

More Telugu News