: ఏపీకి ‘హోదా’పై కదలిక!... ఢిల్లీ రావాలంటూ ఏపీ బీజేపీ నేతలకు పార్టీ అధిష్ఠానం పిలుపు!


బీజేపీ అధినాయకత్వం నుంచి ఆ పార్టీ ఏపీ శాఖకు చెందిన కీలక నేతలకు కొద్దిసేపటి క్రితం ఓ సందేశం వచ్చింది. ఉన్నపళంగా ఢిల్లీ వచ్చేయాలని, రూపు ఢిల్లీలో జరిగే పార్టీ కోర్ కమిటీ భేటీకి హాజరు కావాలని సదరు సందేశంలో ఏపీ నేతలకు సమాచారం అందింది. దీంతో ఆహ్వానం అందిన నేతలంతా ఢిల్లీ ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు. రేపటి కోర్ కమిటీ భేటీలో భాగంగా ఏపీకి సంబంధించిన వ్యవహారంపై కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం. ఏపీ ప్రత్యేక హోదాపై ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలపై సమగ్ర సమాచారం సేకరించడంతో పాటు ఈ విషయంపై ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నెలల తరబడి వాయిదా పడుతూ వస్తున్న ఏపీ బీజేపీ చీఫ్ పదవికి కూడా సరైన నేతను ఎంపిక చేసే విషయంపైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News