: తెలంగాణ కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ నేడే!... నెల పాటు అభ్యంతరాల స్వీకరణ!


తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కార్యరంగం సిద్ధమైపోయింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తన నివేదికను సీఎం కేసీఆర్ కు సమర్పించగా, ఇప్పటికే దానిపై అఖిలపక్ష భేటీ కూడా పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో కొత్తగా 17 జిల్లాలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నోటిఫికేషన్ పై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరించనుంది. కొత్త జిల్లాల డ్రాఫ్ట్ కు సంబంధించిన మార్పులు చేర్పులకు సంబంధించిన ఫిర్యాదులను నెల రోజుల పాటు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గడువు పూర్తి కాగానే అభ్యంతరాల పరిశీలన తర్వాత కొత్త జిల్లాలకు తుది రూపు ఇస్తారు.

  • Loading...

More Telugu News