: ఇంట్లో ఒంటరిగా క్రిస్ గేల్ చేసుకునే పార్టీ ఇలాగే ఉంటుందట!
వెస్టిండీస్ క్రికెటర్, భారత ఐపీఎల్ పోటీల్లో రాయల్ చాలెంజర్స్ తరఫున ఆడుతూ క్రికెట్ అభిమానులకు ఎంతో దగ్గరైన క్రిస్ గేల్, తాను ఒంటరిగా ఉన్నప్పుడు పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుందో చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. స్విమ్మింగ్ పూల్ పక్కనే షార్ట్ వేసుకుని దర్జాగా చేతిలో సిగార్, పక్కనే ఐస్ క్యూబ్ టబ్, గ్లాసులో వైన్ పెట్టుకుని మత్తెక్కిన కళ్లతో కనిపిస్తున్నాడు. తాను సింగిల్ గా పార్టీ చేసుకుంటే ఇట్లానే ఉంటుందంటూ క్రిస్ గేల్ పోస్ట్ చేసిన చిత్రాన్ని మీరూ చూడవచ్చు.