: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం!... దుండగుల కాల్పుల్లో 15 మందికి గాయాలు!
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోతలు మారు మోగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆ దేశంలో తరచూ చోటుచేసుకుంటున్న కాల్పుల ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగానే ఉంది. విశ్వవ్యాప్తంగా ఉగ్రవాదులు పేట్రేగుతున్న నేపథ్యంలో అమెరికాలో ఎక్కడ చిన్న కాల్పుల ఘటన చోటుచేసుకున్నా ఆ దేశం వణికిపోతోంది. తాజాగా కొద్దిసేపటి క్రితం ఆ దేశంలోని కనెక్టికట్ కాల్పులతో దద్దరిల్లింది. నగరంలోని ఓ ఇంటిలో దాక్కున్న గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా జనంపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 15 మంది దాకా గాయపడ్డట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.