: 'వరద పరామర్శ'కు వెళ్లి నీళ్లల్లో కాలుపెట్టని మధ్యప్రదేశ్ సీఎం... పోలీసులు ఇలా మోసుకెళ్లారు!
మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తుండగా, ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. పన్నా జిల్లాలోని అమన్ గంజ్ తెహసిల్ ప్రాంతానికి ఆయనరాగా, వరద నీటిలో ఆయన కాలు పెట్టకుండానే పర్యటన కొనసాగింది. ఇద్దరు పోలీసులు ఆయన్ను రెండు చేతులపై మోసుకుంటూ తీసుకు వెళ్లారు. కనీసం మోకాళ్ల వరకూ కూడా లేని నీటిలో సైతం ఆయన కాలు పెట్టలేదు. ఇక కొద్దిపాటి బురద ఉన్న ప్రాంతంలో ఉత్త కాళ్లతో చౌహాన్ నడుస్తుండగా, ఆయన అంగరక్షకుడు ఒకరు షూలు మోస్తూ కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, నీళ్లల్లో కాలుపెట్టని ఆయన వైఖరిని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.