: భద్రాచలంలో సీతమ్మ వారి మంగళసూత్రాల మాయం నిజమేనన్న ఈఓ


తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతమ్మవారి మంగళసూత్రాలు కనిపించడం లేదన్నది నిజమేనని ఆలయ ఈఓ రమేశ్ బాబు ధ్రువీకరించారు. ఈ విషయంలో మీడియాలో వస్తున్న కథనాలపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రధాన అర్చకులను ఆదేశించగా, వారు మూడు గంటల పాటు లెక్కలు సరిచూసుకుని, రెండు ఆభరణాల లెక్క తేలలేదని చెప్పారని అన్నారు. నిత్య కల్యాణంలో వినియోగించే సీతమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మణస్వామికి సమర్పించే ఆభరణం కనిపించడం లేదని తెలిపారు. ఇవి నవమి లేదా ముక్కోటికి వినియోగించే ప్రత్యేక ఆభరణాల్లో కలిశాయా? అన్న కోణంలో ప్రాథమికంగా విచారిస్తున్నామని తెలిపారు. లేక ఈ ఆభరణాలను మరెక్కడైనా భద్రపరిచారా? అన్న విషయాన్ని పరిశీలించేందుకు నేటి సాయంత్రం వరకూ అర్చకులకు గడువిచ్చినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News