: సింధు పుష్కరస్నానం విజయవాడలో... సంగమ ఘాట్ లో హారతికి హాజరు!
రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలవడం ద్వారా కోట్లాది మంది క్రీడాభిమానుల ప్రశంసలందుకున్న తెలుగుతేజం పీవీ సింధు పవిత్ర కృష్ణా పుష్కరాల్లో స్నానం చేసేందుకు విజయవాడకు రానుంది. రేపు ఇబ్రహీంపట్నం సమీపంలోని సంగమ ఘాట్ కు వచ్చి పుణ్యస్నానం చేయడంతో పాటు హారతి కార్యక్రమంలో పాల్గొంటుందని, ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడికి సింధు నుంచి సమాచారం వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, మరికాసేపట్లో హైదరాబాద్ కు చేరుకునే ఆమెకు తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగతం పలకనున్న సంగతి తెలిసిందే. ఆపై మధ్యాహ్నం గచ్చిబౌలీ స్టేడియంలో సింధును సన్మానించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి.