: 2020 అద్భుతాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపజేసిన జపాన్!


మరో నాలుగేళ్ల తరువాత జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ విషయాన్ని రియోలోనే రుచి చూపించింది జపాన్. టోక్యో మేయర్ కు ఒలింపిక్స్ పతకాన్ని లాంఛనంగా అందించిన తరువాత జపాన్ వేడుకలు రియో వేదికపై ప్రారంభమయ్యాయి. రోబోలు స్టేడియం మైదానంపై జపాన్ జెండాను పరుస్తుండగా ఈ వేడుక మొదలైంది. తమ దేశపు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూనే, అధునాతన టెక్నాలజీని తామెలా వాడుతున్నామో జపాన్ చూపకనే చూపింది. టోక్యోలోని స్టేడియాలతో పాటు మొత్తం నగరాన్నే మకరానా స్టేడియంలో ఆవిష్కరించింది. జపాన్ ప్రధాని షింజో అబే ఏకంగా మైదానం మధ్యలోకి వచ్చేశారు. మైదానం మధ్యలో ప్రత్యక్షమైన వేదికపైకి వచ్చిన ఆయన్ను చూసిన క్రీడాభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. 'సీయూ ఇన్ టోక్యో' అంటూ జపాన్ క్రీడాకారులు ప్రదర్శించిన నృత్య విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ టోక్యోకు స్వాగతం పలుకుతున్నామని ఈ సందర్భంగా అబే వ్యాఖ్యానించారు. మరింత సంబరంగా ఆటల పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News