: నారా లోకేశ్ తో సమావేశమైన మల్లాది విష్ణు


టీడీపీ నేత నారా లోకేశ్ తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ భేటీ జరిగింది. మల్లాది విష్ణుతో పాటు పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, పీసీసీ కార్యదర్శి నరహరిశెట్టి నర్శింహారావు కూడా లోకేశ్ ను కలిశారు. వీరంతా టీడీపీ వైపు చూస్తున్నట్లు, ఆ నేపథ్యంలోనే లోకేశ్ ను కలసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News