: నిరాశపరిచిన భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్
రియో ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ నిరాశపరిచాడు. ఈరోజు సాయంత్రం జరిగిన 65 కిలోల ఫ్రీస్టయిల్ విభాగం క్వాలిఫికేషన్ రౌండ్లోనే యోగేశ్వర్ అపజయం పొందాడు. యోగేశ్వర్ పై మంగోలియాకు చెందిన రెజ్లర్ మందక్ నరన్ గంజోరిజ్ 3-0 తేడాతో విజయం సాధించాడు. బౌట్ ప్రారంభం నుంచి మంగోలియా రెజ్లర్ పై పట్టు కోసం యత్నించిన యోగేశ్వర్ కు ఎక్కడా అవకాశం లభించలేదు. దీంతో, తొలి రౌండ్లో అతడు 1-0 తో ఆధిక్యం ప్రదర్శించిన మందక్ నరన్ అదే జోరు రెండో రౌండ్ లో కూడా ప్రదర్శించి విజయం సాధించాడు.