: చిరంజీవి కోసం అల్లు శిరీష్ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రత్యేక పూజలు
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేను పురస్కరించుకుని యువహీరో అల్లు శిరీష్ ప్రత్యేక పూజలు నిర్వహించాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలంలోని గుర్వాయి గూడెంలోని శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని అల్లు శిరీష్ నిన్న సందర్శించాడు. చిరు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డి గూడెం చిరంజీవి యువత నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి లక్ష తమలపాకుల పూజ, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శిరీష్ మాట్లాడుతూ, చిరంజీవి 150 చిత్రం ఘన విజయం సాధించాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, మరిన్ని సినిమాల్లో ఆయన నటించాలని తాను దేవుడిని కోరుకున్నానని చెప్పాడు.