: ప్రయోగాల దశలో హెచ్‌ఐవీ చికిత్స!


ఇప్పటిదాకా నియంత్రణే తప్ప నివారణ మార్గం లేని మహమ్మారిగా ఎయిడ్స్‌ చెలామణీలో ఉంది. అయితే ఈ వ్యాధి కారకమైన హెచ్‌ఐవీ వైరస్‌ను నిర్మూలించడంలో డెన్మార్క్‌ శాస్త్రవేత్తలు చెప్పుకోదగ్గ పురోగతిని సాధించారు. రోగి డీఎన్‌ఏ నుంచి హెచ్‌ఐవీ వైరస్‌ను వేరుచేసి, శాశ్వతంగా నిర్మూలించడం మీద సరికొత్త పద్ధతుల్ని వీరు ఇప్పుడు పరీక్షించి చూస్తున్నారు. ఇది క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉంది. తాజాగా 15 మంది ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్తుల్ని ఎంచుకుని వారిమీద పరీక్షించి చూస్తున్నారు. ఈ ప్రయోగాలు సఫలమైతే.. హెచ్‌ఐవీ రోగులు దీర్ఘకాలంమందులు తీసుకోవాల్సిన బాధ తప్పుతుందని, వైద్య ఖర్చుల భారం తగ్గుతుందని డాక్టర్లు అంటుండగా.. ఈ చికిత్స విధానానికి అయ్యే ఖర్చు కూడా తక్కువేనట.

రోగి డీఎన్‌ఏలో హెచ్‌ఐవీ వైరస్‌ నిల్వలను వేరు చేయడమే ఈ విధానంలో కీలకం అని.. అందులో పురోగతి కనిపిస్తోందని పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న డెన్మార్క్‌ డాక్టర్‌ సోగార్డ్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News