: మణిపూర్ గవర్నర్ బాధ్యతలు చేపట్టిన నజ్మా హెప్తుల్లా


మణిపూర్ రాష్ట్ర కొత్త గవర్నర్ గా బీజేపీ సీనియర్ నేత నజ్మా హెప్తుల్లా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఇంఫాల్ లోని రాజ్ భవన్ దర్బార్ హాల్ లో ఆమె చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకేష్ రాజన్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ రాష్ట్ర 18వ గవర్నర్ గా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఇబోబి సింగ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. కాగా, ప్రధాని మోదీ మంత్రివర్గంలో మైనార్టీ వ్యవహారాల శాఖా మంత్రిగా విధులు నిర్వహించిన ఆమె, గత నెల 12వ తేదీన ఆ పదవికి రాజీనామా చేశారు. మణిపూర్ గవర్నర్ గా నజ్మాను నియమిస్తూ రాష్ట్రపతి గత వారం ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News