: 3.5 కి.మీ లోతున ఏఎన్-32 శకలాలు కనుగొన్న 'సముద్ర రత్నాకర్'!


గత నెల 22న చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ దీవులకు బయలుదేరి బంగాళాఖాతంపై అదృశ్యమైన భారత వాయుసేన విమానానికి సంబంధించిన శకలాలను చెన్నైకి 161 నాటికల్ మైళ్ల దూరంలో 3.5 కి.మీ లోతున కనుగొన్నట్టు తెలుస్తోంది. అత్యాధునిక రాడార్లు, పరికరాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టిన సముద్ర రత్నాకర్ నౌక ఈ శకలాలను కనుగొనడంతో, ఇవి కూలిపోయిన విమానానివేనా? అన్నది నిర్థారించుకునేందుకు అధికారులు వాటిని ల్యాబ్ కు పంపారు. మొత్తం 14 శకలాలను వెలికితీసి ప్రయోగశాలకు పంపామని నేవీ అధికారులు తెలిపారు. కాగా, ముగ్గురు పైలట్లు సహా 29 మంది ఈ విమానంలో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఈ శకలాలు ఏఎన్-32వే అని తేలితే, విమానం కోసం 30 రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలు ఫలించినట్టేనని అధికారులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News