: చిల్లరగా పడేయడం అన్నది సరైన పద్ధతి కాదు: ఏపీకి కేంద్ర సాయంపై ఎంపీ రామ్మోహన్ నాయుడు
కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిల్లర వేసినట్టుగా రూ. 1,900 కోట్ల సాయం చేయడం సరైన పద్ధతి కాదని ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడకు వచ్చిన ఆయన పున్నమి ఘాట్ లో పుష్కర స్నానం చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన సాయంపై మరింత స్పష్టత ఉండాలని, ఇది ప్యాకేజీగా ఇచ్చారా? హోదాకు ప్రత్యామ్నాయంగా ఇచ్చారా? అన్న విషయం కేంద్రం తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి ఏమిటన్న విషయం తెలిసిన తరువాత తామేం చేయాలో నిర్ణయించుకుంటామని అన్నారు. హోదా రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని, బీజేపీ స్వయంగా చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సి వుందని అన్నారు.