: దేశ రాజధానిలో కాల్పుల కలకలం... కొనసాగుతున్న ఎన్ కౌంటర్
దేశ రాజధానిలో నిత్యమూ బిజీగా ఉండే రోహిణీ సెక్టార్ - 24 వద్ద కాల్పులు ఈ ఉదయం కలకలం రేపాయి. పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న వేళ, అటుగా వచ్చిన పాత నేరగాళ్లు పోలీసులపై కాల్పులకు దిగారు. ఆ వెంటనే పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక పోలీసుకు గాయాలు కాగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నేరస్తులు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతుండగా, ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.