: ఢిల్లీ మెట్రో స్టేషన్ లో వేధింపులకు గురవుతున్న యువతిని రక్షించిన హీరోయిన్ తాప్సీ
ప్రస్తుతం 'పింక్' సినిమాలో నటిస్తూ, షూటింగ్ కోసం వెళ్లే వేళ, మెట్రో రైలును ఆశ్రయిస్తున్న నటి తాప్సీ, తన సాహసంతో ఓ యువతిని అల్లరిమూక నుంచి కాపాడిందట. ఈ విషయాన్ని తాప్సీ స్వయంగా చెప్పింది. ఢిల్లీ శివార్లలో షూటింగ్ ముగించుకుని రైల్వే స్టేషన్ లో దిగి తన కారు దగ్గరకు వెళ్లే సమయంలో కొందరు వ్యక్తులు, ఓ అమ్మాయిని కామెంట్ చేస్తూ, ఏడిపిస్తుండటాన్ని గమనించింది. వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి, మీరెక్కడికి వెళ్లాలో చెబితే, డ్రాప్ చేస్తానని తాప్సీ చెప్పిందట. తానెవరో తెలియకున్నా వెంటనే ఆ అమ్మాయి అంగీకరించి తాప్సీ వెంట వచ్చేసిందట. ఆ అమ్మాయి ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కనిపిస్తే, చూసిన వారు చేతనైనంత సాయపడాలని తాను చేసిన సాహసం గురించి చెప్పుకుంటూ సలహా ఇస్తోందీ ముద్దుగుమ్మ.